తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. రాబరీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. జూలై 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ధిక్కార స్వభావం కలిగిన ఓ యువకుడు తన తండ్రి చేసిన అప్పులు తీర్చాలనే తపనతో జూదం, దోపిడీలతో కూడిన ఓ నేర సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు.
అక్కడ అతను ఎదుర్కొనే ప్రమాదకర పరిస్థితులు, లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతాయని, యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్ తెలిపారు. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్‌రాజ్, శివ్ పండిట్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు. సుభాస్కరన్ నిర్మాత.