Jason Sanjay | తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తమిళ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్ బ్యానర్లో ఈ సినిమా రాబోతుండగా.. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మరోవైపు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో నటించేది ఎవరో లైకా ప్రకటించింది.
జేసన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ నటించబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. జేసన్ సంజయ్ 01 (Jason Sanjay 01) అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సందీప్ హీరోగా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందించబోతున్నాడు. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా విడుదల కాబోతుంది. కాగా ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవ్వనున్నాయి.