యష్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్-చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో పవర్ఫుల్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలిభాగానికి జాతీయ స్థాయిలో లభించిన ఆదరణ దృష్ట్యా సీక్వెల్‌ను మరింత భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమాలో యువతరాన్ని ఉర్రూతలూలించేలా ఓ ఐటెంసాంగ్‌కు రూపకల్పన చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నర్తించనున్నట్లు తెలిసింది. ఈ భామతో పాటు యువ నాయిక నోరా ఫతేహి పేరు కూడా వినిపిస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతంలో హౌస్‌ఫుల్, భాగీ-2, సాహో వంటి చిత్రాల్లో ఐటెంసాంగ్స్‌లో మెప్పించింది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ఈ సుందరికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఐటెంసాంగ్ కోసం ఆమె పేరును ఖరారు చేయొచ్చని వినిపిస్తోంది. ‘కేజీఎఫ్’ మొదటిభాగంలోని ఐటెంసాంగ్‌లో తమన్నా, హిందీ వెర్షన్లో మౌనీరాయ్ నటించారు. రెండోభాగంలోని ప్రత్యేక గీతాన్ని కూడా ఇద్దరు నాయికలతో ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.