టాలీవుడ్ హీరోలు ఒకప్పుడు కేవలం తెలుగు సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేసేవారు. ఇప్పుడలా కాదు. పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు మన సినిమాలు విదేశాలలో సైతం రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు అక్కడి ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నాయి. ముఖ్యంగా జపనీస్ మన సినిమాలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అప్పుడు బాహుబలి సినిమాతో ప్రభాస్‌తో పాటు పలువురు నటీనటులు కూడా జపనీస్‌కు దగ్గరయ్యారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మగధీర సినిమాతో జపాన్ దేశ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యిపోయాడు. ఆయన సినిమాలేవి విడుదలైన వారు ఆ సినిమాలపై కన్నేస్తున్నారు.చరణ్ నటించిన రంగస్థలం చిత్రం వారిని ఎంతగానో అలరించింది. ఇందులో జిగులు రాణి పాట చాలా కనెక్ట్ కాగా, ఈ పాటకి అదే ఎనర్జీతో డ్యాన్స్ చేసి అదరగొట్టింది జపాన్ కపుల్. ప్రస్తుతం ఈ పాట మెగా ఫ్యాన్స్‌ని తెగ అలరిస్తుంది. చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య అనే చిత్రాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
姉弟でお家でインドダンス完全再現【Rangasthalam Songs – Jigelu Rani / Ram Charan, Pooja Hegde】@sasakiasahi @AlwaysRamCharan @hegdepooja #RamCharan #PoojaHegde #インドダンス
— HIROMUNIERU (@HIROMUNIERU1) June 30, 2021
↓full ver↓https://t.co/kjPdVwaKXn pic.twitter.com/VJA0eoFFZm