Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 37 రోజులు జైలు జీవితం గడిపిన జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు అతడికి బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ ప్రస్తుతం తన టైం అంతా ఫ్యామిలీకే కేటాయిస్తున్నాడు. మళ్లీ తాను ఎప్పుడు జైలుకు వెళతానో తేలిక ఉన్న సమయంలోనే తన కుటుంబంతో గడిపేస్తున్నాడు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ తాజాగా టూర్‌కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని జానీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. తన భార్య, పిల్లలతో కలిసి బీచ్ దగ్గర దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అరెస్ట్ విషయానికి వస్తే.. లేడి డ్యాన్సర్‌ను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 20న అరెస్ట్ అయ్యాడు జానీ మాస్టర్. గత 36 రోజులుగా జైలు జీవితం గడిపిన జానీకి రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం విడుదల అయ్యారు. 2017లో ఓ టీవీ షోలో పాల్గోన్న ఒక మహిళ కొరియోగ్రాఫర్‌తో జానీ మాస్టర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే జానీ తన టీంలో తీసుకున్నాడని.. నేను మైనర్‌గా ఉన్న సమయంలోనే ఒక హోటల్లో జానీ తనపై హత్యాచారానికి పాల్పడ్డాడు అని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376, 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రోడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు. రీసెంట్గా జాతీయ అవార్డుల నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు బెయిల్ కావాలని కోర్టును కోరగా.. బెయిల్ మంజూరు చేసింది. అయితే అవార్డును క్యాన్సిల్ చేసింది జాతీయ అవార్డుల కమిటీ. అనంతరం బెయిల్ గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు జానీ. అయితే రెగ్యూలర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు అతడికి బెయిల్‌ను మంజూరు చేసింది.
After all we went through… Our fam deserves these relieved smiles ❤️✨ pic.twitter.com/HBQQGIx9BC
— Jani Master (@AlwaysJani) November 15, 2024