Jani Master | లైంగిక వేధింపుల కేసులో జైలుకి వెళ్లి బెయిల్ మీద బయటికి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తొలిసారి ఒక మూవీ ఈవెంట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జబర్తస్థ్ ఫేమ్, నటుడు రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తుండగా.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రానుంది. తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ బగవాన్, జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా..
ఈ వేడుకకు జానీ మాస్టర్ వచ్చి మాట్లాడుతూ.. ముందుగా నేను ఈ తప్పు చేయలేదని నమ్మిన ప్రజలందరికీ .. అలాగే నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి పరిస్థితి అనేది వచ్చిన తర్వాత ఎవరు అసలు కనపడరు. అలాంటిది నన్ను మీ ఇంటి పిల్లోడిలాగా.. నన్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. త్వరలోనే అసలు నిజం బయటపడుతుంది అప్పటివరకు వెయిట్ చేయండి అంటూ జానీ మాస్టర్ చెప్పుకోచ్చాడు.
Thank you to everyone who has placed their trust in me. I will uphold that trust. You will soon find out what it is!
– #JaniMaster pic.twitter.com/cDbbEpXFgF
— Filmyscoops (@Filmyscoopss) November 19, 2024