జాన్వీకపూర్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘పరమ్ సుందరి’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌పై నెట్టింట ట్రోల్స్ వచ్చాయి. ఉత్తరాది అమ్మాయి అయిన జాన్వీని మలయాళీగా చూపించడంపై పలువురు కేరళ నెటిజన్లు అసంతృప్తి వెలిబుచ్చారు. కేరళ నేపథ్య చిత్రంలో నటించేందుకు కేరళ హీరోయిన్లు లేరా? జాన్వీనే దొరికిందా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ విషయంపై ఈ సినిమా ప్రమోషన్స్‌లో జాన్వీ మాట్లాడారు. ‘అవును నేను ఉత్తరాది అమ్మాయినే.
మలయాళీని కాను. ఆమాటకొస్తే మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు. కానీ కేరళ సంస్కృతిపై నాకు ఆపారమైన గౌరవం ఉంది. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు నేను అభిమానిని. ‘పరమ్సుందరి’ సినిమాలో నేను తమిళం అమ్మాయిగా కూడా కనిపిస్తా. అయినా నేను ఇండియన్ని. నా దేశానికి చెందిన ఏ సంస్కృతి అయినా నాదే.’ అంటూ చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్.