Janhvi Kapoor | దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్ (Janhvi Kapoor). ధడక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. కెరీర్ తొలినాళ్లలోనే ఓ వైపు గ్లామరస్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. రొమాంటిక్, కామిక్, హార్రర్, థ్రిల్లర్.. ఇలా అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ వెళ్తూ తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ చేస్తున్న దేవర (Devara) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని తెలిసిందే.
ఇదిలా ఉంటే మరో ఆసక్తికర వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. జాన్వీకపూర్ కన్ను ఇప్పుడు కోలీవుడ్ (kollwood)పై పడిందన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తమిళ హీరో కమ్ డైరెక్టర్ (లవ్‌టుడే ఫేం) ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో జాన్వీకపూర్‌ను ఫీ మేల్ లీడ్ కోసం పరిశీలిస్తున్నారన్న అప్డేట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా టాక్ ప్రకారం డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఇటీవలే జాన్వీకపూర్‌ను కలిసి కథ వినిపించాడని, గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యమని ఇన్సైడ్ టాక్. జాన్వీకపూర్ కూడా కథపై పాజిటివ్‌గా స్పందించినట్టు సమాచారం. జాన్వీకపూర్ కోలీవుడ్ ఎంట్రీపై త్వరలోనే స్పష్టత రానుందట.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రాన్ని లెజెండరీ నటుడు, నిర్మాత కమల్‌హాసన్ హోం బ్యానర్ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్‌పై తెరకెక్కించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. రానున్న రోజుల్లో ఈ క్రేజీ సినిమాపై మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్. జాన్వీకపూర్ హీరోయిన్గా నటించిన బవాల్ ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.