Janhvi Kapoor | ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర ఉత్సవాల్లో ఒకటైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తొలిసారి సందడి చేసింది అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. గత వారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌కి ప్రపంచంలో ఉన్న ఫేమస్ నటీనటులు అందరు హాజరై సందడి చేస్తూ ఉంటారు. హాలీవుడ్ నటీమణులు ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరై రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అయితే తొలిసారి జాన్వీ కపూర్ కేన్స్ ఫిలింఫెస్టివల్‌కి హజరై ప్రపంచాన్నంతా తనవైపుకి తిప్పుకుంది.
మంగళవారం జాన్వీ కపూర్ , ఇషన్ కట్టర్ జంటగా నటించిన ‘హోమ్‌బౌండ్ సినిమా ప్రీమియర్ జరుపుకోగా, దాని కోసం జాన్వీ కేన్స్‌లో తొలిసారి అడుగు పెట్టింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన మెటాలిక్ పింక్ కలర్ ప్రీ-డ్రేప్డ్ సారీతో జాన్వీ రెడ్ కార్పెట్‌పై నడిచి చూపరుల దృష్టిని తనవైపుకి తిప్పుకుంది. జాన్వీ కపూర్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో కేన్స్లోను అర్ధమైంది. ఆమె కారు దిగిన మొదలు వేల కొద్ది కెమెరాలు ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.ఆమెని తమ కెమెరాలలో బంధించేందుకు ఫొటోగ్రాఫర్స్ పోటీ పడ్డారు.
ప్రస్తుతం జాన్వీ కపూర్ క్యూట్ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు జాన్వీ కపూర్ కూడా తన ఇన్‌స్టాలో కేన్స్ లుక్‌కి సంబంధించిన ఫొటో షూట్ చేసి ఆ పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా మరో నాలుగు రోజులు మే 24 వరకు ఈ కేన్స్ ఉత్సవం జరగనుంది.ఎంతో మంది అందాల భామలు కేన్స్‌లో సందడి చేయనున్నారు. కాగా, జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి పెద్ది అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా హిట్ అయితే జాన్వీ రాత మారినట్టే. తెలుగులో తొలిసారి చేసిన దేవర మంచి విజయం సాధించగా, ఇప్పుడు పెద్ది కూడా విజయం సాధిస్తే అమ్మడికి ఆఫర్ల వెల్లువ కురవడం ఖాయం అంటున్నారు.