Janhvi Kapoor | ‘దేవర’ పాటల్లో ఎన్టీఆర్‌కి ధీటుగా డ్యాన్స్‌లు చేసి ఆడియన్స్‌ని ఫిదా చేసేసింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ‘దేవర-1’ ప్రమోషన్స్‌లో ప్రస్తుతం జాన్వీ బిజీ బిజీగా ఉంది. నిదానంగా మీడియాతో ఇంటర్వ్యూలు కూడా షురూ చేసింది. తాజాగా తన టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది జాన్వీ. ‘బాలీవుడ్లో నాకు అవకాశాలకు కొదవ లేదు. పైగా తక్కువ సమయంలో మంచి పాత్రలు పోషించాను. అయితే.. నేను సౌత్‌లో కూడా రాణించాలనేది అమ్మ కోరిక. ఆమె కోరిక తీర్చాలంటే సౌత్ సినిమా చేయాలి. దానికి తగ్గట్టే సౌత్ నుంచి నాకు ఆఫర్లొచ్చాయి.
వాటిలో తెలుగు నుంచి ‘దేవర’ ఒకటి. అలాగే తమిళంలో కూడా ఓ సినిమా వచ్చింది. ఈ రెండింటిలో ఏ సినిమా చేయాలో తెలియక తికమక పడ్డాను. అప్పుడు కరణ్‌జోహార్ నాకు మార్గదర్శనం చేశారు. ‘తారక్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా మంచి ఛాన్సులొస్తాయి’ అని అన్నారు. ఆయన సలహా పాటించాను. ఆ సలహా నిజంగా కూడా బాగా కలిసొచ్చింది. వెంటనే రామ్‌చరణ్ సినిమా వచ్చింది. ఇంకా కొన్ని సినిమాలు టాక్స్‌లో ఉన్నాయి. ఏదేమైనా తెలుగు సినిమాతో సౌత్‌కి ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్