Janhvi Kapoor on Vijay Devarakonda | విజయ్ దేవరకొండ – రష్మిక మంధన ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? వీరిద్దరి రిలేషన్‌పై చాలా రోజులుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. తమ మధ్య ఏమీ లేదని ఇద్దరూ చెబుతున్నప్పటికీ ఫ్యాన్స్ నమ్మడం లేదు. అప్పుడప్పుడు వీరి ప్రవర్తన కూడా ఇందుకు కారణమనే చెప్పొచ్చు. దీంతో అసలు విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏం ఉందనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
జాన్వీ కపూర్ నటించిన మిలీ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్న జాన్వీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా తన రిలేషన్షిప్ స్టేటస్ ఏంటో చెప్పాలని హోస్ట్ జాన్వీని ప్రశ్నించాడు. అప్పుడు జాన్వీ స్పందిస్తూ.. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని.. ఎవరితో ప్రేమలో లేనని స్పష్టం చేసింది. సౌత్‌లో ఎవరితో నటించాలని ఉందని అడగ్గా.. జూనియర్ ఎన్టీఆర్ అని తడుముకోకుండా చెప్పేసింది. ఆ తర్వాత హోస్ట్ మరో ప్రశ్న అడిగాడు. మీకు స్వయంవరం పెడితే ఇండస్ట్రీలో ఏ ఇద్దరు హీరోలు పాల్గొనాలని కోరుకుంటారని ప్రశ్నించాడు. అప్పుడు రణ్‌బీర్‌కపూర్, టైగర్ ష్రాఫ్ అని బదులిచ్చింది. రణ్‌బీర్‌కి ఇప్పటికే పెళ్లి అయిపోయిందన్న విషయాన్ని ప్రస్తావించాడు హోస్ట్. వేరే పేరు చెప్పాలని సూచించాడు. దానికి జాన్వీకపూర్ తెగ ఆలోచిస్తుండగా.. విజయ్ దేవరకొండ పేరును హోస్ట్ సూచించాడు. కానీ రౌడీ హీరో పేరు చెప్పడానికి జాన్వీ నిరాకరించింది. ప్రాక్టికల్‌గా అతనికి పెళ్లి అయిపోయింది కదా అంటూ నోరుజారింది. ఈ విషయాన్ని నెటిజన్లు పట్టేసుకున్నారు. రష్మిక మంధనతో విజయ్ దేవరకొండ రిలేషన్లో ఉండటం వల్లే జాన్వీ కపూర్ ఇలా సమాధానమిచ్చిందని నెటిజన్లు ఫిక్సయిపోయారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మంధన ప్రేమలో ఉన్నారని గత నాలుగేండ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వారిద్దరూ సర్దిచెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ల పనులతో దొరికిపోతూ ఫ్యాన్స్‌లో ఎప్పటికప్పుడు అనుమానాలను రేకెత్తిస్తున్నారు. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కలిసి కనిపించారు. అంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే దొరికిపోయారు. దీంతో కచ్చితంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జాన్వీకపూర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
“Sridevi | బోనీతో ఆ అలవాటు మాన్పించాలని శ్రీదేవి ప్రాణాల మీదకు తెచ్చుకుందట”