ముంబై: జాన్వీ కపూర్(Janhvi Kapoor) తన ఫ్యాషన్ లుక్స్‌తో స్టన్ చేస్తోంది. జాన్ గల్లియానో బ్లాక్ కలర్ డ్రెస్సులో జిగేల్మంది ఆ బ్యూటీ. 1986 ఫాలన్ ఏంజిల్స్ కలెక్షన్‌కు చెందిన డ్రెస్సింగ్‌ను జాన్వీ ధరించింది. ఫ్రాన్స్ ఉద్యమ కాలంతో 1986 కలెక్షన్‌కు లింకు ఉన్నది. ప్రాచీన గ్రీకు, రోమన్స్కు చెందిన సాధారణ స్టయిల్లో డ్రెస్సు ఉంటుంది. గల్లియానో డిజైన్‌లో చాలా లైటర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. బ్లాక్ చార్కోల్ షేడ్‌లో ఉన్న సీజర్ ప్లీట్ డ్రెస్సును జాన్వీ వేసుకున్నది. ఆ ఔట్‌ఫిట్‌కు స్కాలోప్ నెక్లైన్ ఉంది. లాంగ్ స్లీవ్స్, కర్వ్ పౌచ్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. ఇక ష్కర్ట్కు కూడా క్రాసోవర్ సీజర్ కట్టింగ్‌తో డిజైన్ ఉంది. రియా కపూర్ ఈ డ్రెస్సును స్టయిల్ చేసింది. ఈ ఔట్‌ఫిట్‌కు తగినట్లు హై హీల్స్ వేసుకుంది జాన్వీ. క్లచ్ అండ్ డార్క్ సన్‌గ్లాసెస్ కూడా పెట్టుకుంది ఆ క్యూటీ.