Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా జాన్వీ ధరించిన ఒక నైట్‌సూట్ మరోసారి ఆమె రిలేషన్‌షిప్‌పై చర్చలకు తెరతీసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, పలుమార్లు కలిసి కనిపించడం, ఫ్యామిలీ వేడుకలు, ఈవెంట్లకు హాజరుకావడం వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫొటోలో జాన్వీ పింక్ కలర్ నైట్సూట్తో పాటు గ్రే జాకెట్ ధరించి కనిపించింది. అయితే ఆమె డ్రెస్‌పై ఉన్న ఒక ఆసక్తికరమైన వాక్యం అందరి దృష్టిని ఆకర్షించింది. “If Lost, Please Return to Shikhar Pahariya” (నేను తప్పిపోతే దయచేసి శిఖర్ పహారియాకు అప్పగించండి) అనే మెసేజ్ నైట్‌సూట్‌పై ఉండటంతో ఈ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. దీంతో జాన్వీ తన ప్రేమను పరోక్షంగా వ్యక్తం చేసిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలు బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు, అభిమానులు భారీగా స్పందించారు. “ఇదే నిజమైన రిలేషన్షిప్ గోల్స్”, “శిఖర్ కోసం జాన్వీ ఇచ్చిన క్యూట్ సిగ్నల్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
జాన్వీ కపూర్ తన ప్రేమను ఇలా పరోక్షంగా వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ‘శిఖర్’ పేరు ఉన్న నెక్లెస్‌ను ధరించి పలు కార్యక్రమాల్లో పాల్గొంది. మరోవైపు శిఖర్ కూడా సోషల్ మీడియాలో జాన్వీ సినిమాలను, విజయాలను అభినందిస్తూ పోస్టులు చేస్తుంటాడు. వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం గురించి బాలీవుడ్లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే ఇద్దరూ ఇప్పటివరకు తమ రిలేషన్‌షిప్‌పై అధికారిక ప్రకటన చేయలేదు.గత ఏడాది జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కూడా శిఖర్ పహారియా జాన్వీతో కలిసి కనిపించాడు. జాన్వీ నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్ర ప్రీమియర్ సందర్భంగా శిఖర్ ఆమెకు మద్దతుగా నిలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.