Janhvi Kapoor Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని బాలీవుడ్ సినీ నటీనటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా దర్శించుకున్నారు. గురువారం ఉదయం తిరుమలకి చేరుకున్న వీరిద్దరూ నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించి, పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. ఈ సినిమా హిట్టు అవ్వాలని కోరుకుంటూ ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ కలిసి తిరుమల దర్శనం చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.