విదేశాలకు వెళ్లినప్పుడు చాలా మంది అబ్బాయిలు తనకు లవ్ప్రపోజల్స్ చేస్తుంటారని, వారి నుంచి తప్పించుకోవడానికి తనకు పెళ్లయిందని అబద్ధం చెబుతుంటానని అగ్ర కథానాయిక జాన్వీకపూర్ తెలిపింది. ఈ భామ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పరమ్ సుందరి’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి సరదా సంగతుల్ని పంచుకుంది.
‘విదేశాలకు వెళ్లినప్పుడు కొందరు యువకులు నాతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించేవారు. హోటల్స్కు వెళ్లినప్పుడు నా అనుమతి లేకుండానే రకరకాల వంటకాలను తెప్పించి నన్ను ఇంప్రెస్ చేయాలనుకునేవారు.
వారిని దూరం పెట్టడానికి నాకు పెళ్లయిందని చెప్పేదాన్ని. లాస్ఏంజెల్స్కు వెళ్లినప్పుడు ఓ సందర్భంలో కొందరు యువకులకు..నా ఫ్రెండ్, సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓర్రీతో కలిసి ఉన్న ఫొటోలు చూపించి అతనే నా భర్తని అబద్ధం చెప్పాను. వారందరూ నిజమని నమ్మారు కూడా’ అని చెప్పింది జాన్వీకపూర్.