Janhvi Kapoor | యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘పరమ సుందరి’ మూవీతో వార్తల్లో నిలిచింది. శనివారం జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంది. ముంబయిలో దహి-హండీ వేడులకు హాజరైంది. ఈ సందర్భంగా ఉట్టి కొట్టి అభిమానులకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా జాన్వీ భారత్ మాతా కీ జై అంటూ ఉట్టిని పగులగొట్టింది. నటి చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. జాన్వీ సాంప్రదాయ లుక్లో చాలా ముద్దుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా జాన్వీపై పలువురు ట్రోల్స్ చేశారు. వాస్తవానికి, మహారాష్ట్రలో మరాఠీ భాషా వివాదం కొనసాగుతున్నది. జాన్వీ కార్యక్రమంలో మరాఠీలో ప్రసంగించింది.
నెటిజన్లు ఆమెను హిందీ చిత్రాల్లో నటించడం ఆపి.. మరాఠీ చిత్రాల్లో పని చేయాలంటూ సూచించారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. జాన్వీ సినిమా ఒక్కటీ మరాఠీలో నిర్మించలేదని.. కానీ ప్రమోషన్ మాత్రం మరాఠీ భాషలో సాగుతాయంటూ విమర్శించారు. మరో యూజర్ మాట్లాడుతూ ‘ఇలా మాట్లాడేందుకు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశావ్’ అంటూ కామెంట్ చేశాడు. అయితే కార్యక్రమం అనంతరం కారు వద్దకు వెళ్తుండగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఆమె దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జాన్వీ కాస్త టెన్షన్ పడింది. ముఖంలో కొట్టొచ్చినట్లుగా టెన్షన్ కనిపించింది. టెన్షన్ పడుతూనే చివరకు బౌన్సర్ల సహాయంతో కారు వద్దకు చేరుకుంది. ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా ‘పరం సుందరి’లో నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కానున్నది.