సుమన్, అజయ్‌ఘోష్, కిషోర్, వెంకట రమణ, ప్రగ్యనైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జనం’. వెంకటరమణ పసుపులేటి దర్శకుడు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. సుమన్ మాట్లాడుతూ ‘నేటి సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి చర్చించే కథాంశమిది. సందేశంతో పాటు చక్కటి వినోదం ఉంటుంది.
ఈతరం సంస్థ సినిమాల తరహాలో సమాజానికి ఉపయుక్తమయ్యే కథగా నిలుస్తుంది. సమాజంలో మార్పు రావాలని ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం’ అన్నారు. రెండు భాగాలు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ రెడ్డి, సంగీతం: రాజ్‌కిరణ్, కథ, మాటలు, దర్శకత్వం, నిర్మాత: వెంకట రమణ పసుపులేటి.