విమర్శకుల ప్రశంసలందుకున్న మలయాళ కోర్ట్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ తెలుగులో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి తెలుగు వెర్షన్ జీ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. సురేష్‌గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకుడు.
జె.ఫణీంద్రకుమార్ నిర్మాత. న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్గా ఇందులో సురేష్‌గోపి కనిపిస్తారు. ఆయన సహాయంతో లైంగిక వేధింపుల నుంచి బయటపడ్డ జానకి విధ్యాధరన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. న్యాయంకోసం ఓ న్యాయవాది, ఓ యువతి చేసే పోరాటమే ఈ సినిమా. ఈ చిత్రానికి కెమెరా: రెనదివే, సంగీతం: గిబ్రాన్, గిరీష్ నారాయణన్, నిర్మాణం: కాస్మోస్ ఎంటైర్టెన్మెంట్స్.