సుహాస్, సంగీర్తన జంటగా దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మాతలు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ ‘ ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది డిఫరెంట్ కథతో తెరకెక్కిన సినిమా. వినోదంతోపాటు ఆడియన్స్‌ని ఎడ్యుకేట్ చేసేలా ఉంటుంది. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బావుంటుంది. ఈ నెల 6న ప్రీమియర్లు వేస్తున్నాం. ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. ఇంకా సుహాస్, దర్శకుడు సందీప్‌రెడ్డి బండ్ల, ఎడిటర్ కోదాటి పీకే, విజయ్ బుల్గానిక్ కూడా మాట్లాడారు.