OG Movie | పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు మాత్రమే ఓజీ సినిమా చూడడానికి వీలు ఉంది. అయితే సెన్సార్ ఇచ్చిన నిబంధనలను పక్కనపెట్టి.. ఈ సినిమాకు పిల్లలను అనుమతించినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు జనసేన ఎమ్మెల్యే మాధవి లోకం వెళ్లగా.. అక్కడ సినిమా చూసిన అనంతరం ఓజీ చూశాను అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్‌లో ఒక చిన్నపిల్లవాడు కనిపిస్తున్నాడు. దీంతో సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాకు పిల్లలను ఎలా అనుమతించారంటూ అటు థియేటర్ యాజమాన్యంతో పాటు ఇటు జనసేన ఎమ్మెల్యే మాధవిని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కొందరూ అయితే పిల్లలను ఏ రేటింగ్ సినిమాకు తీసుకురాకుడదని తెలియదు. నువ్వు ఒక ఎమ్మెల్యే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి తాజా చిత్రం #OG ప్రీమియర్ షో విజయవాడలోని మల్టీప్లెక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగ మాధవి గారు ప్రత్యేకంగా హాజరై సినిమా వీక్షించారు. ప్రజలతో కలిసి ఆనందాన్ని… pic.twitter.com/h1TbyuwOCa
— Madhavi Lokam (@LokamMadhavi) September 25, 2025