Jana Nayagan | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్(Thalapathy Vijay) మళ్లీ షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జన నాయగన్ (ప్రజల నాయకుడు). ఈ సినిమాకు కార్తీ (ఖాకీ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 09న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల విజయ్ సభలో జరిగిన తొక్కసలాటాలో 40 మందికి పైగా చనిపోవడంతో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు. దీంతో మూవీ కూడా వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా అనుకున్న తేదీకే రాబోతుందని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకుంది. అలాగే ఈ సినిమా కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభం అయ్యిందని త్వరలోనే విజయ్ కూడా షూటింగ్లో హాజరు కాబోతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మిస్తుంది. పూజ హెగ్దేతో పాటు ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు.
Let’s Begin 🔥🔥🔥#Thalapathy @actorvijay sir #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss @LohithNK01 @RamVJ2412 @TSeries #JanaNayagan#JanaNayaganPongal #JanaNayaganFromJan9 pic.twitter.com/4VlEonM0Q9
— KVN Productions (@KvnProductions) November 6, 2025