Jamie Lever | ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు జానీ లివర్ కుమార్తె, నటి జామీ లివర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసిన జామీ, గత ఏడాది అల్లరి నరేష్ నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అయితే తన బాల్యంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను గురించి తాజాగా గుర్తుచేసుకుంది జామీ. ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న జామీ సంచలన విషయాలను వెల్లడించింది.
నాకు 10 ఏండ్లు ఉన్నప్పుడు స్కూల్ అయిపోగానే కారులో కూర్చున్నాను. తన సోదరుడు జెస్సీ కోసం డ్రైవర్ బయట ఎదురుచూస్తున్నాడు. ఈ సమయంలోనే ఒక వ్యక్తి కారు దగ్గరకు వచ్చి తనను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కారు డోర్ తీసి లోపలికి వస్తే తన పరిస్థితి ఏంటని భయంతో వణికిపోయాను. వెంటనే కారు డోర్ లాక్ చేసి, ఆ వ్యక్తిని చూడనట్లే ఉన్నానని దాంతో అతడు కాసేపటికి వెళ్లిపోయాడని జామీ తెలిపింది. అంతేకాకుండా, తమ స్కూల్ బస్ డ్రైవర్ కూడా తమతో మర్యాదగా ప్రవర్తించేవాడు కాదని, ఎప్పుడూ ఏదో ఒక విధంగా తాకాలని చూసేవాడని జామీ వివరించారు. “ఇదంతా ఒక పీడకలలా మర్చిపోవాలనుకునేదాన్ని. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యక్తే ఇలా నీచంగా ఆలోచిస్తే ఏమనాలి?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని, అందుకే అబ్బాయిలను తన జీవితంలోకి ఇన్వైట్ చేయాలంటే భయమేసిందని జామీ తెలిపారు. అయితే తనకు 20 ఏండ్లు ఉన్నప్పుడు కేవలం ఒక్కరిని మాత్రమే డేటింగ్ చేశానని పేర్కొన్నారు. తనకు జరిగిన ఈ అనుభవాలను తన తల్లి సుజాతకు గానీ, తండ్రి జానీ లివర్‌కు గానీ చెప్పుకోలేదని జామీ లివర్ వెల్లడించారు.