James Cameron | హాలీవుడ్ చిత్రం అవతార్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.విజువల్ వండర్‌గా తెరకెక్కిన మూవీ ఎన్నో రికార్డులని చెరిపేసింది. ఇప్పటికే అవతార్ సిరీస్‌లో వచ్చిన రెండు భాగాలు ప్రేక్షకులని ఎంతగానో అలరించడమే కాక కోట్ల వసూళ్లు సాధించాయి. ఇప్పుడు మూడో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవతార్ 3 మూవీ ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ శుక్రవారం వస్తున్న చిత్రంతో థియేటర్స్ లో ట్రైలర్ ప్రదర్శించనున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
భారీ హాలీవుడ్ చిత్రం అయిన మార్వెల్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీతో కలిపి థియేటర్లలో ప్రదర్శించనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రెండింటిపైన ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. జేమ్స్ కెమెరూన్ తన సినిమా ప్రపంచాన్ని పంచభూతాల కాన్సెప్ట్ ఆధారంగా నిర్మిస్తున్నట్టు సమాచారం.మొదటి అవతార్‌లో ‘భూమి’, రెండో భాగంలో ‘నీరు’ (వాటర్) నేపథ్యంలో తెరకెక్కించగా, ఇప్పుడు మూడో పార్ట్‌లో ‘నిప్పు’ (ఫైర్) నేపథ్యంలో కథ సాగనుందని తెలుస్తోంది. ఈ కొత్త కథా కోణంతో పండోరా ప్రపంచం మరో అద్భుతంగా ప్రేక్షకులని అలరించనుంది. జేమ్స్ కెమెరూన్ అవతార్ ఫ్రాంఛైజీకి ఇది చివరది కాదు… ఇంకా పలు సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయి
అవతార్ 4 .. 2029లో విడుదల కానుండగా, అవతార్ 5 లో 2031 లో రిలీజ్ కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లు ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. కెమెరూన్ ఇప్పటికే కొన్ని పార్ట్స్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 19న అవతార్ 3 రిలీజ్ కానుండడంతో, ఆ నెల 15 తర్వాత రిలీజ్ కావాల్సిన భారతీయ సినిమాలు తమ తేదీలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కెమెరూన్ సినిమా వస్తుందంటే దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా పక్కకు తప్పుకుంటాయి. జేమ్స్ కెమెరూన్ విజన్, వీఎఫ్ఎక్స్తో కూడిన అద్భుతమైన ప్రపంచం చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అవతార్ 3 ట్రైలర్‌తో ప్రారంభమయ్యే ఈ మాజికల్ జర్నీ, డిసెంబర్లో మరింత పీక్కు చేరనుంది.