సెప్టెంబర్ 2న టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kayan) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు జల్సా ( Jalsa ReRelease) స్పెషల్ షోస్‌కు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇంతకీ జల్సా ఎక్కడెక్కడ విడుదల కాబోతుందని తెగ ఆలోచిస్తున్న అభిమానుల కోసం కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం జల్సాకు 500 స్పెషల్ షోలను ప్లాన్ చేశారట ఫ్యాన్స్.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ఏ, ఆస్ట్రేలియాల్లో కూడా జల్సా స్పెషల్ షోలు పడబోతున్నాయని ఇన్సైడ్ టాక్. అంతేకాదు స్పెషల్ షో వేస్తున్న చాలా ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పడబోతున్నాయన్న వార్త ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. కాగా ఇంకో ఆసక్తికర విషయమేంటంటే పవన్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తమ్ముడు చిత్రాన్ని కూడా ఆగస్టు 31న కొన్ని షోలు వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు టాక్ నడుస్తోండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మొత్తానికి పవన్ అభిమానులు డబుల్ బొనాంజా గిఫ్టులతో ఫుల్ ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారని తాజా అప్డేట్ చెప్పేస్తుంది. జల్సాను సరిగమ సినిమాస్ (Sarigama Cinemas) యూఎస్ఏలో రీరిలీజ్ చేయనుందని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు.
ఈ మూవీలో ఇలియానా, కమలినీ ముఖర్జీ, పార్వతి మెల్టన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ మెరిశారు. ముఖేశ్ రిషి విలన్‌గా నటించగా.., ప్రకాశ్ రాజ్, అలీ, తనికెళ్లభరణి,శివాజీ ఇతర పాత్రల్లో నటించారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.