జైలర్
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
స్ట్రీమింగ్ తేదీ: సెప్టెంబర్ 7
నటీనటులు: రజనీకాంత్, రమ్యకృష్ణ, వినాయకన్, మోహన్‌లాల్, తమన్నా తదితరులు.
పంద్రాగస్టు కానుకగా ఆగస్టు 10న బాక్సాఫీస్ దగ్గర విడుదలైన చిత్రం జైలర్. రజనీకాంత్‌ను కొత్తగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ, కథనం కుదరడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లు వసూలు చేసింది. కథలోకి వెళ్తే.. ముత్తు (రజనీకాంత్) పోలీసుగా పనిచేసి రిటైర్ అవుతాడు. తన భార్య (రమ్యకృష్ణ), ఏసీపీగా పనిచేస్తున్న తనయుడు అర్జున్, మనవడే లోకంగా బతుకుతుంటాడు. హాయిగా సాగిపోతున్న ఆయన జీవితంలో ఊహించని తుఫాను రేగుతుంది. ముత్తు కొడుకు కనిపించకుండా పోతాడు. విలన్ల ముఠా వారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. వాళ్ల నుంచి ముత్తు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడన్నది మిగిలిన కథ.