Jailer 2 | కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం జైలర్ (Jailer 2). రజనీకాంత్‌కి చాలా రోజుల తర్వాత ఒక కమర్శియల్ బ్లాక్‌బస్టర్‌ని అందించింది ఈ చిత్రం.
అయితే ఈ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నట్లు దర్శకుడు నెల్సన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రోడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే ఈ సినిమాకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జైలర్ 2 ప్రోమోను పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన షూట్‌ని కూడా డిసెంబర్లోనే మేకర్స్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.