సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూన్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘జైలర్’ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ సీక్వెల్‌పై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 160కోట్లకు కొనుగోలు చేసిందని తెలిసింది. ఇది ఇప్పటివరకు తమిళ సినిమా ఓటీటీ హక్కుల విషయంలో రికార్డని, రజనీకాంత్ సినిమాల్లో కూడా అత్యధికమని చెన్నై సినీ వర్గాలంటున్నాయి.
చిత్ర నిర్మాణ సంస్థ సన్పిక్చర్స్తో ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకుందని సమాచారం. ‘జైలర్’ తొలిభాగం దాదాపు 600కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్పై ట్రేడ్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. ఈ క్రేజ్ కారణంగానే అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి డిజిటల్ హక్కుల్ని కొనుగోలు చేసిందని అంటున్నారు. ఎస్జే సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.