ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నట్టు కొద్ది రోజుల క్రితం తెలియజేశారు.గ్యాంగ్ స్టర్ డ్రామాతో తెరకెక్కుతున్న చిత్రమని వార్తలు వస్తుండగా, ఇందులో పాకిస్తాన్ ఆర్మీ బంధించిన 54 మంది భారతీయ సైనికుల్ని విడిపించే సాహసి గా దేశభక్తుడైన సైనికుడిగా ప్రభాస్ కనిపిస్తారని టాక్స్ వినిపిస్తున్నాయి.
హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి “రాజమన్నార్” అనే పాత్రను ఈ రోజు పరిచయం చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఇక కొద్ది సేపటి క్రితం రాజమన్నార్ పాత్రలో జగపతిబాబు లుక్‌కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. పవర్ ఫుల్ లుక్‌లో జగ్గూభాయ్ కనిపిస్తుండగా, ఈ చిత్రం ఆయనకు మరింత పేరు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
లెజెండ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ అలరిస్తున్నారు. స్టార్ హీరోలకు సమానంగా ఆయన కాల్షీట్స్ ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీల, మలయాళ భాషలలో జగపతి నటిస్తున్నారు. ఇక సలార్ సినిమా షూటింగ్ విషయానికొస్తే… “సలార్”లో మేజర్ షూటింగ్ పూర్తయింది. ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌పై పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసాడు. ఆ తర్వాత ప్రధాన జంటపై కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేయనున్నారు.