Jagapathibabu | రియల్ ఎస్టేట్ (Real Estate)లో మోసాలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు (Jagapathibabu) ప్రజలకు సూచించారు. తనకు జరిగిన మోసాన్ని తెలియజేస్తూ జగపతిబాబు ఓ వీడియో విడుదల చేశారు. ‘అందరికీ నమస్కారం.. ఈ మధ్య రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు.
ఇటీవలే నేను ఒక యాడ్ చేశాను. నన్నూ మోసం చేశారు. సదరు రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్లు చెక్కు విషయంలో నన్ను మోసం చేశారు. నన్ను మోసం చేసిన వాళ్ల వివరాలు త్వరలోనే బయటపెడతానని చెప్పారు. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు రెరా అనుమతులు జాగ్రత్తగా చూసుకోవాలని’ జగపతిబాబు ప్రజలకు సూచించారు. ఇంతకీ ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఏంటనేది తెలియాల్సి ఉంది.