Jagapathi Babu | టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ మనసులు దోచుకున్న జగపతి బాబు, ఇప్పుడు విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్‌తో సరికొత్త ఇమేజ్ను ఏర్పరచుకున్నారు. తాజాగా, ఆయన హోస్ట్‌గా మారి జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోలో దుమ్ము రేపుతున్నారు. ఈ షోలో ప్రముఖ సెలబ్రిటీలను ఆహ్వానించి, వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ హ్యూమర్‌తో పాటు ఎమోషన్స్ కలిపిన షోని నడిపిస్తున్న జగపతి బాబు, తాజాగా ఓ స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేశారు.
ఈ ఎపిసోడ్‌కి గెస్ట్లుగా టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ మీనా, మహేశ్వరి, సిమ్రాన్ హాజరయ్యారు. షూట్ సమయంలో వీరంతా జగపతి బాబుతో కలిసి దిగిన ఫోటోను మీనా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ ఫోటో చూసిన నెటిజన్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. నాలుగోదశకంలోకి ప్రవేశించినా కూడా ఈ సెలెబ్రిటీలంతా ఎంతో ఎనర్జీతో కనిపించడం విశేషం.ఈ ముగ్గురు హీరోయిన్స్‌తో జగపతి బాబుకి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు ఉన్నాయి.
మీనాతో చిలకపచ్చ కాపురం, జగన్నాటకం, భలే పెళ్లాం, మహేశ్వరితో ప్రియరాగాలు, జాబిలమ్మ పెళ్లి, సిమ్రాన్తోను పలు ప్రాజెక్టుల్లో కలిసి నటించిన సంగతీ తెలిసిందే. ఇప్పుడు వీళ్లంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అప్పటి గోల్డెన్ మూమెంట్స్ గుర్తుకు వచ్చాయి. ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందో అనే ఆసక్తితో అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీళ్ల మధ్య ఫన్, పాత జ్ఞాపకాలు, అప్పుడు తెర వెనుక జరిగిన విషయాలు అన్నీ ఒకేసారి తెలుసుకునే అవకాశం ఈ ఎపిసోడ్లో దొరుకనుంది. టెలివిజన్ స్క్రీన్ మీద ఆసక్తికర విషయాలు గుర్తు చేసే ఈ షోని అస్సలు మిస్ కాకండి.ఇప్పటికే ఈ షో ద్వారా నాగార్జున, నాని, ఆర్జీవి, సందీప్ రెడ్డి వంగాల నుండి ఆసక్తికర విషయాలు రాబట్టారు జగపతి బాబు. మరి ఈ భామలతో ఏయే విషయాలు బయటకు తెస్తారో చూడాలి.