Jagapathi Babu | ఆ తప్పులు ఇప్పుడు చేయడం లేదు: జగపతిబాబు
‘సెకండ్ ఇన్నింగ్స్‌లో నా సినిమా లైఫ్ పెరిగింది. ఈ ఇన్నింగ్స్ అన్ని రకాలుగా బావుంది. హీరో అనేది పెద్ద బాధ్యత. ఇప్పుడు నాలో ఆ ఒత్తిడి లేకపోవడంతో దర్శకుడు కోరుకునే నటనను ఇవ్వడం చాలా తేలికవుతుంది’ అన్నారు నటుడు జగపతిబాబు.
Jagapathi Babu | ‘సెకండ్ ఇన్నింగ్స్‌లో నా సినిమా లైఫ్ పెరిగింది. ఈ ఇన్నింగ్స్ అన్ని రకాలుగా బావుంది. హీరో అనేది పెద్ద బాధ్యత. ఇప్పుడు నాలో ఆ ఒత్తిడి లేకపోవడంతో దర్శకుడు కోరుకునే నటనను ఇవ్వడం చాలా తేలికవుతుంది’ అన్నారు నటుడు జగపతిబాబు. ఆయన గోపీచంద్‌తో కలిసి నటించిన చిత్రం ‘రామబాణం’ శ్రీవాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జగపతిబాబు చిత్ర విశేషాలను పంచుకున్నారు.
సెంటిమెంట్ తగ్గిపోయింది..!
ఇప్పుడు అన్నీ హారర్, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కుటుంబ భావోద్వేగాలతో ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలమైంది. శ్రీవాస్ ‘రామబాణం’ కథ చెప్పగానే అన్నదమ్ముల అనుబంధం, ఇతర కుటుంబ భావోద్వేగాలు కూడా నచ్చాయి. గతంలో చేసిన శివరామరాజు కూడా అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూసి విడిపోయిన కొన్ని కుటుంబాలు కలిశాయి. రామబాణం కూడా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా. సింగిల్ సెన్సార్ కట్ లేకుండా హాయిగా ఓ మంచి సినిమా చూశామనే అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు సినిమాల్లో సెంటిమెంట్ తగ్గిపోయింది. సినిమా ఎంత క్రూరంగా వుంటే అంత బావుంటుంది. అందుకే నేను సక్సెస్ అయ్యాను (నవ్వుతూ) అయితే అంత నెగిటివిటీలో కూడా పాజిటివిటీ వుందని చెప్పడానికి వస్తుంది ‘రామబాణం’. దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచాడు.
పాత్ర నచ్చకపోతే నో చెబుతున్నాను
ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా క్యారెక్టర్ రోల్స్ చేశాను. అయితే ఇందులో చెప్పుకోవడానికి ఏడెనిమిది సినిమాలే వున్నాయి. కొంత మంది దర్శకులు నన్ను సరిగ్గా వాడుకోలేదనే అనిపించింది. నేను డైరెక్టర్ యాక్టర్‌ని. డైరెక్టర్‌కి ఏం కావాలో వాళ్ల కళ్లలో చూస్తే అర్థమౌతుంది. ఆ ఫీల్ వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ కూడా బావుంటుంది. ఇప్పుడున్న కొంత మంది దర్శకులతో నాకు మంచి వేవ్‌లెంగ్త్ కుదురుతుంది. ఇక కాంబినేషన్ కోసమని, నన్ను ఓ సెట్ ప్రాపర్టీగా కావాలనుకునే పాత్రలు చేయడం లేదు. పాత్రలో ఒక రిచ్‌నెస్ వుండాలి. జగపతిబాబు వున్నాడు పెట్టేయండనే సినిమాలు చేయడం లేదు. గతంలో చేసిన ఇలాంటి తప్పులను ఇప్పుడు చేయడం లేదు. పాత్ర నచ్చకపోతే నో చెబుతున్నాను. అన్ని భాషల్లో నాకు మంచి పాత్రలు, బలమైన పాత్రలు లభిస్తున్నాయి.
డబ్బు ముఖ్యం కాదు
కొన్ని సినిమాల విషయంలో కాంబినేషన్ అనేది ఆసక్తిని కలిగించినా..ఫైనల్‌గా కథే సినిమాను నిలబెడుతుంది. ఈ విషయంలో నేను రాజీపడను. కలర్‌ఫోటో, కేరాఫ్ కంచరపాలెం, బలగం సినిమాలు నాకు బాగా నచ్చాయి. ఇలాంటి సినిమాల్లో నేను లేను అనే బాధ కూడా వుంది. అయితే నేను చిన్న సినిమాలు చేయను, వాళ్లకి అందను అని ఫిక్స్ అయిపోయారు. రెండూ తప్పే. నాకు డబ్బు ప్రాధాన్యత కాదు. అందులో నా పాత్ర, సినిమా ముఖ్యం. గాడ్‌ఫాదర్ లాంటి పాత్రతో పాటు గాయంకు మరో స్థాయిలో వుండే పాత్ర మరొకటి చేయాలని వుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

