Kurchi Madathapetti | టాలీవుడ్ సెన్సేషనల్ పాట ‘కుర్చీ మడతబెట్టి’ ఇప్పుడు బాలీవుడ్లోనూ ఊపేస్తోంది. ఈ పాటకు తాజాగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు – శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన ఈ పాట గుంటూరు కారం చిత్రంలోనిది. త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ, రాధకృష్ణ నిర్మించారు. 2024లో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలు మాత్రం చార్ట్ బస్టర్గా నిలిచాయి. ఇందులో ‘కుర్చీ మడతబెట్టి’ పాట అయితే 2024లో టాప్ 10లో నిలిచిందని చెప్పవచ్చు.
అయితే తాజాగా, జాక్వెలిన్ ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్, ఎనర్జీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అవార్డుల ఈవెంట్లో భాగంగా జాక్వెలిన్ ఈ పాటకు డ్యాన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక జాక్వెలిన్ కుర్చీ మడతబెట్టి పాటకు డ్యాన్స్ చేయడం పట్ల మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Jacqueline performing kurchi ni madathapetti song #jacquelinefernandez pic.twitter.com/FRYP3U1gHY
— Socrates (@goloko777) August 2, 2025