Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బుధవారం పటియాల హౌస్ కోర్టుకు హాజరైంది. గ్యాంగ్‌స్టర్ సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించి రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో కోర్టుకు వచ్చింది. ఈ కేసులో గురువారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై ఈ నెల 18న మరోసారి విచారణ జరుగనున్నది.
రూ.200కోట్ల మోసం కేసులో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌తో నటికి ఉన్న సంబంధాల నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ విషయంలో ఈడీ పలుమార్లు బాలీవుడ్ నటిని విచారించింది. సుకేశ్ నుంచి జాక్వెలిన్ అనేక విలువైన బహుమతులు పొందిందని ఈడీ గుర్తించింది. ఆ తర్వాత సుకేశ్‌తో జాక్వెలిన్ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను జాక్వెలిన్ ఖండించింది. ఈ కేసులో తనను కావాలని ఇరికించారని, సుకేష్ జీవితాన్ని నాశనం చేశాడన్న నటి.. కెరీర్‌ని మొత్తం నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
హోంశాఖలో అధికారిగా పరిచయం చేసుకుని.. తనను తప్పుదారి పట్టించాడని తెలిపింది. జైలులో ఉండి కూడా తనతో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడే వాడని, కానీ జైల్లో విషయాన్ని మాత్రం తనకు తెలియనివ్వలేదని వెల్లడించింది. ఈ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. ఈ కేసులో మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి పేరుతో వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. జాక్వెలిన్ చివరి సారిగా అక్షకుమార్, ఇమ్రాన్ హష్మీ నటించిన ‘సెల్ఫీ’ చిత్రంలో ‘దీవానే’ స్పెషల్ సాంగ్‌లో నటించింది. ప్రస్తుతం ‘ ఫతే’ చిత్రంలో నటిస్తున్నది.
#WATCH | Actor Jacqueline Fernandez arrives at Delhi's Patiala House court, in connection with hearing in Rs 200 crore money laundering case pic.twitter.com/jpqR3eIIEy
— ANI (@ANI) April 5, 2023