బండ్లగూడ,డిసెంబర్ 23: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ సత్తార్ (48) మంగళవారం విధులు ముగించుకుని హసన్నగర్లోని ఇంటికి బైక్పై బయలు దేరాడు.
పిల్లర్ నంబర్ 192 వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన డీసీఎం అతివేగంగా సత్తార్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సత్తార్ అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు డీసీఎం వాహనదారుడిని పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న అత్తాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అతడి తమ్ముడు జబ్బార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.