Shikhar Dhawan | టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తాజాగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి ఒక ప్రత్యేక మ్యూజిక్ వీడియోలో సందడి చేశారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘బెసోస్’ అనే ఆల్బమ్ మే 8, 2025న విడుదల కాగా.. ఈ వీడియోలో ధావన్ ఇదివరకు చూడని సరికొత్త లుక్‌లో కనిపించారు. ఈ పాట ఒక ఉత్సాహభరితమైన, ఎనర్జిటిక్ మెలోడీతో ఉంది.. ఇందులో శిఖర్ ధావన్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ద్వారా ధావన్లోని మరో కోణాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారు. గతంలో ధావన్ ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించినప్పటికీ, ‘బెసోస్’ మ్యూజిక్ వీడియోలో పూర్తి స్థాయిలో నటించడం ఇదే మొదటిసారి.
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, అంతర్జాతీయ కళాకారుడు కార్ల్ వైన్ కలిసి ఈ పాటను పాడగా.. రాజత్ నాగ్‌పాల్, ఫ్రీబోట్, కార్ల్ వైన్ కలిసి ఈ పాటకు సంగీతం అందించారు. పీయూష్, షాజియా ఈ వీడియోకు దర్శకత్వం వహించారు.