Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఢిల్లీ పాటియాలా కోర్టుకు హాజరైంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారించిన కోర్టు మే 25 నుంచి జూన్ 12 వరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 25 నుంచి 27 వరకు అబుదాబిలో జరిగే ఐఐఎఫ్ఏ అవార్డుల వేడుకలకు హాజరుకానున్నట్లు తెలిపింది. అలాగే 28 నుంచి జూన్ 12 వరకు ఇటలీలోని మిలన్కు వెళ్లేందుకు అనుమతి కోరగా.. న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
రూ.200కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిపైగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న జాక్వెలిన్‌ను ఈడీ అరెస్టు చేయకపోయినా.. గతేడాది నవంబర్ 15న కోర్టు బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మనీలాండింగ్ కేసులో ఈ కేసులో లంకన్ బ్యూటీని ఈడీ పలుమార్లు విచారించి, ఆస్తులను సైతం అటాచ్ చేసింది.
జాక్వెలిన్‌కు సుకేష్ చంద్రశేఖర్ రూ.7కోట్లకుపైగా విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా ఇచ్చాడని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఆమె కుటుంబ సభ్యులకు అనేక అత్యాధునిక కార్లు, ఖరీదైన బ్యాగులు, బట్టలు, బూట్లు, ఖరీదైన వాచ్‌లను బహుమతిగా ఈడీ ఆరోపించింది.రాన్‌బాక్సీ మాజీ బాస్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటిస్తూ సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్లు దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్టయిన సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.