Jabardasth | బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత పది సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతూనే ఉంది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే ఇందులో లేడి గెటప్‌తో అలరించే వారు కూడా లేకపోలేదు. కొందరు లేడి గెటప్ వేసి అలరిస్తుంటే మరి కొందరు మాత్రం అమ్మాయిలుగా మారి ఈ షోలో తెగ సందడి చేస్తున్నారు. జబర్థస్త్ తన్మయి హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయిగా ఆపరేషన్ చేయించుకుంది. ఆమె చాలా రోజుల పాటు జబర్ధస్త్‌లో కనిపించి సందడి చేసింది.
తాజాగా తన్మయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..జబర్ధస్త్‌లో ముగ్గురమే ట్రాన్స్‌గా మారినట్టు చెప్పుకొచ్చింది. సాయి లేఖ, ప్రియాంక సింగ్,నేను అబ్బాయిల నుంచి అమ్మాయిలుగా మారినట్టు తన్మయి చెప్పుకొచ్చింది. అబ్బాయిలుగా పుట్టినా హార్మోన్స్ ప్రాబ్లస్ వల్ల అమ్మాయిలుగా మారాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. తన్మయికి చిన్నప్పటి నుండి అమ్మాయిగా ఉండటమే ఇష్టమట. ఇంట్లో వాళ్లకి కూడా ఈ విషయం తెలుసట. అయితే అమ్మాయిగా మారేందుకు తాను మాడు సర్జరీలు చేయించుకున్నట్టు పేర్కొంది. తన్మయి ప్రస్తుతం జబర్దస్త్ చేస్తుండగా సాయి లేఖ అంతగా కనిపించడం లేదు. ప్రియాంక సింగ్ మాత్రం బిగ్ బాస్ లో పాల్గొని ఎంత క్రేజ్ అందిపుచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తన్మయి జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయట. అవి కూడా చెప్పుకొచ్చింది . కొన్ని రోజుల క్రితం కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ మోసం చేశారు, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఇండస్ట్రీ అందరు మోసం చేశారు. అందరికి నా మనీ, నా బాడీ కావలి అంతే. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు, నా వెనక తిరిగిన వాళ్ళు ఎవరూ ఒక్క రోజు కూడా ఫుడ్ పెట్టరు. నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోడానికి నాకు ఎవరూ లేరు. రీసెంట్గా నా నడుముకి సర్జరీ జరిగింది. చూసుకోవడానికి ఎవరు లేరు. నాన్న చనిపోయారు. అమ్మ ఒక్కతే ఉన్నారు. అమ్మమ్మ, నాన్నమ్మ ముసలివాళ్ళు నేనే సపోర్ట్ చేయాలి. మా అన్న ఊళ్ళో తాపీ పని చేస్తూ బతుకుతాడు. వాళ్ళ పిల్లలకు నేనే మంచి చదువు చెప్పించాలి అంటూ తన బాధలు చెప్పుకుంటూ ఏడ్చేసింది తన్మయి.