Jabardasth Nukaraju | ‘పటాస్’ కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన నూకరాజు–ఆసియా జంట ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. పటాస్ తర్వాత ‘జబర్దస్త్’ షోలో స్కిట్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ జంటగా పలు కామెడీ స్కిట్స్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆన్ స్క్రీన్‌లో ప్రేమికులుగా కనిపించే వీరు, రియల్ లైఫ్‌లో స్నేహితులే అయినప్పటికీ…ప్రేమలో ఉన్నారన్న వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి.. ఆ మధ్య ఇద్దరి విభేదాలు ఏర్పడి రిలేషన్ బ్రేకప్ అయ్యిందని కూడా గాసిప్స్ వినిపించాయి. అయితే వీటి గురించి నూకరాజు గానీ, ఆసియా గానీ ఇప్పటివరకు స్పందించింది లేదు.
ప్రస్తుతం ఈ జంట ప్రొఫెషనల్‌గా బిజీగా ఉంది. ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలలో కలిసి పనిచేస్తున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన “నా గుండె గోదారి”, “తాటి బెల్లం”, “ఉరితాడు ఉయ్యాలయ్యిందా?”, “నా చెల్లెమ్మా” పాటలకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జబర్దస్త్ ఫేమ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన “సల్లగుండరాదే” అనే మరో ఫోక్ సాంగ్‌తో తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చారు. జులై 4న ఈ పాట ప్రోమో విడుదలైంది. ఇందులో ఆసియా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతే, నూకరాజు ఆమెను మరిచిపోలేక తల్లడిల్లిపోతాడు. ఆమెతో గడిపిన సంతోషాలను తలచుకుని భావోద్వేగానికి లోనవుతాడు.
గుండెలు పగిలేలా ఏడుస్తాడు. నూకరాజు బాధపడుతున్న తీరు చూసి ప్రేక్షకులు కూఆ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమోకు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. ‘‘రీల్ లైఫ్‌లో సరే కానీ రియల్ లైఫ్‌లో ఇలా జరగకూడదు’’, ‘‘ఆసియా నువ్వు ఎప్పుడూ నూకరాజుతోనే ఉండాలి’’ అంటూ అభిమానులు భావోద్వేగపూరితమైన కామెంట్లు చేస్తున్నారు. జబర్దస్త్ బాబు దర్శకత్వం, నూకరాజు నేచురల్ యాక్టింగ్, ఆసియా గ్లామర్..ఇలా అన్నీ కలిసి ఈ సాంగ్‌ను హిట్ చేస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఫుల్ వెర్షన్ త్వరలోనే విడుదల కాబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.