‘జజర్దస్త్’ అవినాష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రీవెడ్డింగ్ ప్రసాద్’ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నబీషేక్ నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి క్లాప్‌నివ్వగా, కోన వెంకట్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు సాయిరాజేష్ సినిమా టైటిల్, లోగోను ఆవిష్కరించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమిది. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి’ అన్నారు. సాయికుమార్, రియాజ్, రూపా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: సురేష్ బీమగాని, రచన-దర్శకత్వం: రాకేష్ దుబాసి.