Jabardasth Comedian Punch Prasad Health Update | కామెడీ పంచ్‌లతో నవ్వించిన పంచ్ ప్రసాద్ ఇప్పుడు కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడని తెలిసి అభిమానులంతా షాకయ్యారు. జబర్దస్త్ నటుడు నూకరాజు ఒక వీడియోను పోస్టు చేయడంతో విషయం తెలుసుకున్న అభిమానులు.. పంచ్ ప్రసాద్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అతని ఆరోగ్యం ఎలా ఉందని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ ఆరోగ్యంపై మరో అప్డేట్ను నూకరాజు తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశాడు.
పంచ్ ప్రసాద్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని నూకరాజు తన వీడియోలో తెలిపాడు. ఇంతకుముందు ఇద్దరు పట్టుకున్న అడుగు తీసి అడుగు పెట్టేందుకు ఇబ్బంది పడ్డ పంచ్ ప్రసాద్.. ఓ మనిషి సాయంతో లేదా కర్ర సాయంతో నడవగలుగుతున్న దృశ్యాలను ఆ వీడియోలు చూపించాడు. గత నాలుగు రోజులుగా పంచ్ ప్రసాద్‌కు చికిత్స జరుగుతోందని.. రోజూ సెలైన్స్ ఎక్కిస్తున్నారని వీడియోలో పేర్కొన్నాడు. ఒక నర్సు ఇంట్లోనే ఉండి చికిత్స అందిస్తున్నట్టు తెలిపాడు. తాజాగా ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ కూడా చేయించుకున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. పంచ్ ప్రసాద్ నడవగలడా? లేదా అన్న విషయాన్ని వారం గడిచిన తర్వాతనే చెప్పగలమని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకొని.. తమను నవ్వించాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Abbas | ఆస్పత్రి బెడ్‌పై అలనాటి నటుడు అబ్బాస్.. ప్రేమ దేశం నటుడికి ఏమైంది?
Srikanth | చిరాకు తెప్పిస్తుంది.. ఇలాంటివి ఏమాత్రం నమ్మొద్దు.. విడాకుల పుకార్లపై హీరో శ్రీకాంత్