Abbas | ఆస్పత్రి బెడ్‌పై అలనాటి నటుడు అబ్బాస్.. ప్రేమ దేశం నటుడికి ఏమైంది?
Prema Desham Actor Abbas | ప్రేమ దేశం సినిమాతో 90వ దశకంలో కుర్రకారు ఫేవరేట్‌గా మారాడు అబ్బాస్. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. యూత్‌లో ఆయనకు ఎంత ఉండేదంటే మాటల్లో చెప్పలేం.
Prema Desham Actor Abbas | ప్రేమ దేశం సినిమాతో 90వ దశకంలో కుర్రకారు ఫేవరేట్‌గా మారాడు అబ్బాస్. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. యూత్‌లో ఆయనకు ఎంత ఉండేదో మాటల్లో చెప్పలేం. అబ్బాస్ కటింగ్ అంటే అప్పట్లో కుర్రాళ్లు పడిసచ్చిపోయేవాళ్లు. ఇక ఇప్పటి వాళ్లకు అబ్బాస్ గురించి చెప్పాలంటే హర్పిక్ యాడ్‌తో మళ్లీ అంతే క్రేజ్ తెచ్చుకున్నాడు. 2015 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అబ్బాస్.. విదేశాలకు వెళ్లి సెటిలైపోయాడు. అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నాడు. ఇలా చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అబ్బాస్.. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో తనకి ఏమైందని అంతా ఆరా తీస్తున్నారు.
గత కొన్ని రోజులుగా అబ్బాస్ కాలి నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతనికి వైద్యులు సర్జరీ చేశారు. ఇదే విషయాన్ని చెబుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆందోళన పడ్డానని.. భయం వేసిందని రాసుకొచ్చాడు అబ్బాస్. నా భయాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించా. నా మనస్సు దృఢంగా ఉంచుకునేందుకు చాలా ట్రై చేశా. నాకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం బాగానే ఉన్నా సర్జరీ తర్వాత కొంత ఉపశమనం కలిగింది అంటూ ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. అబ్బాస్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
ప్రేమదేశం అనే తమిళ డబ్బింగ్ సినిమాతో పరిచయమైన అబ్బాస్.. తెలుగులో ప్రియా.. ఓ ప్రియా, రాజా, కృష్ణబాబు, అల్లుడుగారు వచ్చారు, నీ ప్రేమకై వంటి సినిమాల్లో నటించాడు. తమిళంలో పలు సీరియల్స్‌లోనూ మెప్పించాడు. ముఖ్యంగా హర్పిక్ యాడ్‌తో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2015లో పచ్చక్కల్లం అనే మలయాళం సినిమాలో చివరిసారిగా కనిపించాడు.
Read More :
Srikanth | చిరాకు తెప్పిస్తుంది.. ఇలాంటివి ఏమాత్రం నమ్మొద్దు.. విడాకుల పుకార్లపై హీరో శ్రీకాంత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

