ధర్మారం, సెప్టెంబర్ 28 : కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2 అనుబంధ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి శ్రీరాజరాజేశ్వర (మిడ్ మానేర్) జలాశయానికి గోదావరి జలాల ఎత్తిపోతలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నెల 4వ తేదీ నుంచి 12 వరకు, ఆ తర్వాత 15వ తేదీ నుంచి 28వరకు ఎత్తిపోతలు చేపట్టారు.
కాగా, నీటి పారుదల శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 4:30 గంటలకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లో నాలుగు మోటర్లను నిలిపి వేసినట్టు ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వస్తే మళ్లీ జలాల ఎత్తిపోతలు చేపడుతామని వారు పేర్కొన్నారు.