Jabaradasth Actress Rithu chowdary | బజర్దస్త్ లేడి కమెడియన్ రీతూ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రీతూ చౌదరి తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తనే స్వయంగా చెప్తూ భావోద్వేగపూరిత నోట్‌ను స్టోరీలో పెట్టింది. తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను స్టోరీలో పెట్టి ‘నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఆ ఫోటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నీతో తీసుకున్న లాస్ట్ ఫోటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావు నాన్న? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా.. నీ కుతురు దగ్గరికి’ అంటూ రీతూ చౌదరి ఎమోషనల్ అయింది.
ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బబర్ధస్త్ కమెడియన్స్, ఆడియెన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక రీతూ చౌదరికి తన నాన్న అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పింది. టిక్ టాక్ వీడియోలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న రీతూ చౌదరి అమ్మ కోసం, ఇంటి గుట్టు వంటి పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ నుండి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లి లేడి కమెడియన్‌గా సెటిల్ అయిపోయింది. ఇక జబర్ధస్త్‌తో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.