Jaat Movie | మతపరమైన వివాదం.. క్షమాపణలు తెలిపిన ‘జాట్’ టీమ్
Jaat Movie | బాలీవుడ్ నటులు సన్నీ డియోల్ నటించిన తాజా చిత్రం జాట్(Jaat Movie). వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
Jaat Movie – Religious controversy | బాలీవుడ్ నటులు సన్నీ డియోల్ నటించిన తాజా చిత్రం జాట్(Jaat Movie). వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఒక సన్నివేశం మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నటులు సన్నీ డియోల్‌తో పాటు రణ్‌దీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్‌లపై కేసు రిజిస్టర్ చేశారు జలంధర్ పోలీసులు. జాట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో పాటు నిర్మాతలపైన కూడా కేసు పెట్టారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 299 ప్రకారం కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 10వ తేదీన జాట్ చిత్రం విడుదల కాగా.. ఆ ఫిల్మ్‌లో క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే రీతిలో ఓ సీన్ ఉన్నట్లు ఫిర్యాదు నమోదు అయ్యింది. యేసు క్రీస్తును అగౌరవపరుస్తున్న రీతిలో సీన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలు ఉన్న ఈ పవిత్ర మాసంలో కావాలనే ఆ సినిమాను రిలీజ్ చేశారని, క్రైస్తవుల్లో ఆగ్రహాన్ని తెప్పించి, దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని, అందుకే డైరెక్టర్, నిర్మాత, రచయితపై కేసు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదిలా వుంటే.. తాజాగా ఈ వివాదంపై జాట్ టీమ్ క్షమాపణలు తెలిపింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నోట్ విడుదల చేసింది. జాట్ సినిమాలోని ఒక సన్నివేశం ఒక మతం వారిని కించపరిచినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో మేం బాధపడడంతో పాటు వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించాం. ఈ సినిమాతో ఎవరి మనోభావాలూ కించపరిచే ఉద్దేశం మాకు లేదంటూ చిత్రబృందం రాసుకోచ్చింది.
Our sincere apologies to everyone whose sentiments were hurt.
The objectionable scene has been removed.#JAAT pic.twitter.com/vj8tbKDxoi— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

