Bigg Boss Telugu Season 9 | జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గోనబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి.
కొన్ని రోజుల క్రితం స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వద్ద శ్రష్ఠి వర్మ డ్యాన్స్ అసిస్టెంట్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే అతడి వద్ద బయటకి వచ్చిన అనంతరం జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి కేసు పెట్టింది. దీంతో జానీ మాస్టర్ అరెస్టై జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాత జానీ మాస్టర్, అతని భార్య ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వివాదం అప్పట్లో మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ కేసు ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో నడుస్తుండగా.. శ్రష్ఠి వర్మ ప్రస్తుతం స్వంతంగా కొరియోగ్రాఫర్‌గా చేస్తుంది.
అయితే బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను షో నిర్వాహకులు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ జాబితాలో శ్రష్ఠి వర్మ పేరు కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, బిగ్ బాస్ హౌస్‌లో ఆమె మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. ఆమె జీవితంలోని వివాదాలను, ఎమోషనల్ కథను ఉపయోగించుకుని బిగ్ బాస్ నిర్వాహకులు టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో పలు ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్న శ్రష్ఠి వర్మ, బిగ్ బాస్ హౌస్‌లో ఇంకెన్ని కొత్త విషయాలు బయటపెడుతుందో చూడాలి. అయితే, ఈ వార్తలపై శ్రష్ఠి వర్మ ఇంకా అధికారికంగా స్పందించలేదు. బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం అయితేనే దీనిపై క్లారిటీ వస్తుంది.