Michael | సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన దివంగత లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మైఖేల్’. ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రలో అతని మేనల్లుడు (సోదరుడు జెర్మైన్ జాక్సన్ కుమారుడు) జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. జాఫర్ లుక్, డ్యాన్స్ మూమెంట్స్ అచ్చం కింగ్ ఆఫ్ పాప్‌ను పోలి ఉండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. యాక్షన్ చిత్రాల దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తుండగా.. ఆస్కార్ విజేత గ్రాహమ్ కింగ్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. మరోవైపు మైఖేల్ జాక్సన్ జీవితంలో ఉన్న వివాదాస్పద అంశాలను, బాల్యంలో జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఈ బయోపిక్‌లో ఎలా చూపిస్తారు అనే దానిపై హాలీవుడ్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 24, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.