Dhanush Directorial Movie | దర్శకుడిగా ఇటీవల రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జాబిలమ్మా నీకు అంత కోపమా(Jaabilamma Neeku Antha Kopama). మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్, అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా పవిష్, మాథ్యూ థామస్ కథానాయకులుగా నటిస్తున్నారు. వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్బేర్ బ్యానర్‌పై ఈ సినిమాను కస్తూరి రాజా, విజయలక్ష్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే లవ్ & కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. గత ఏడాది యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన గోల్డెన్ స్పారో అంటూ ప్రియాంక మోహనన్ డ్యాన్స్ చేసిన పాట కూడా ఈ సినిమాలోనిదే.