Jaabilamma Neeku Antha Kopama | తమిళ నటుడు ధనుష్ (Dhanush) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (Jaabilamma Neeku Antha Kopama). మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్, అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ధనుష్ మేనల్లుడు పవిష్, మాథ్యూ థామస్ కథానాయకులుగా నటించారు. వండర్బేర్ బ్యానర్‌పై ఈ సినిమాను కస్తూరి రాజా, విజయలక్ష్మి నిర్మించగా.. వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమా తమిళ వెర్షన్ ఇప్పటికే ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అందుబాటులోకి రాగా.. తెలుగు వెర్షన్‌ని మాత్రం సింప్లీ సౌత్ అనే ఓటీటీ కొనుగోలు చేసింది. అయితే ఈ ఓటీటీ తెలుగులో ఎవరికి తెలవకపోవడంతో తాజాగా మళ్లీ తెలుగు వెర్షన్‌ని కూడా అమెజాన్ ప్రైమ్ వదిలింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా నేటినుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది.
#NEEK (Telugu) Version is now
streaming on Amazon Prime.#JaabilammaNeekuAnthaKopama pic.twitter.com/LdUIldeWAL— OTT Gate (@OTTGate) March 31, 2025