దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ జేఆర్డీ టాటా జీవిత కథతో ‘మేడ్ ఇన్ ఇండియా-ఏ టైటాన్ స్టోరీ’ పేరుతో అమెజాన్ మాక్స్ ప్లేయర్లో ఓ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. రాబీ గ్రేవాల్ దర్శకుడు. వినయ్ కామత్ రచించిన ‘మేడ్ ఇన్ ఇండియా-ఏ టైటాన్ స్టోరీ’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్కు రానుంది.
ఇందులో జేఆర్డీ టాటా పాత్రలో నసీరుద్దీన్‌షా నటిస్తున్నారు. మంగళవారం ఆయన పాత్ర తాలూకు లుక్‌ను విడుదల చేశారు. టాటా వ్యాపార సామ్రాజ్య విస్తరణలో జేఆర్డీ టాటా తాలూకు ప్రణాళికలు, అద్భుతమైన విజన్‌ను ఈ సిరీస్‌లో ఆవిష్కరించబోతున్నామని దర్శకుడు తెలిపారు.
1980ల నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో జేఆర్డీ టాటా, టైటాన్ వాచ్ కంపెనీ ఫౌండర్ జెర్క్సెస్ దేశాయ్‌ల మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారనే వైనాన్ని ఆవిష్కరించబోతున్నారు.