SIIMA 2023 | ఇండియాలో నిర్వహించే పాపులర్ ఫిలిమ్ అవార్డ్స్ షోల్లో ఒకటి సైమా (SIIMA 2023). సౌతిండియాలోనే అతి పెద్ద అవార్డ్స్ ఈవెంట్‌గా సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు పేరుంది. ప్రతీ ఏడాది దక్షిణాది సినిమాలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల నుంచి ఉత్తమ సినిమాలను ఎంపిక చేసి సైమా అవార్డులను ప్రదానం చేస్తుంటారని తెలిసిందే. సైమా 10వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వాహకులు సైమా 2023 అవార్డ్స్ షెడ్యూల్‌ను ప్రకటించారు.
తాజా అప్డేట్ ప్రకారం సైమా 2023 అవార్డ్సు ప్రదాన కార్యక్రమం సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరుగనుంది. రెండు రోజులపాటు జరుగనున్న ఈ అవార్డ్స్ వేడుకకు సంబంధించి రాబోయే రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. దక్షిణాది సినిమాల్లో ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులు, టెక్నీషియన్లను ఎంపిక చేయడంలో భాగంగా షో నిర్వాహకులు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ త్వరలోనే మొదలు కానుండగా.. తేదీలపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
మొత్తానికి ఈ సారి సైమా (South Indian International Movie Awards)షోలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల నుంచి ఏఏ సినిమాలు అవార్డులు అందుకుంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఇంకేముంది మరికొన్ని రోజుల్లోనే సైమా వేడుకలో అభిమాన నటీనటుల సందడి మొదలు కానుందని తెలియడంతో.. ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్.
సైమా అవార్డ్సు 2023 షెడ్యూల్..
#SIIMA #SIIMA2023 #Dubai pic.twitter.com/sqVTOkomeA
— taran adarsh (@taran_adarsh) June 22, 2023